కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి
1 min read– ఐ ఎఫ్ టి యు జిల్లా సహాయ కార్యదర్శి ఎం శంకర్ డిమాండ్
పల్లెవెలుగు, వెబ్ నంద్యాల: విజయ పాల కేంద్రంలో పనిచేస్తున్న కార్మికులను అక్రమంగా అన్యాయంగా తొలగించారని తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలని ఐ ఎఫ్ టి యు జిల్లా సహాయ కార్యదర్శి ఎం శంకర్ డిమాండ్ చేశారు .శనివారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత కొంతకాలంగా విజయ పాల కేంద్రంలో పనిచేస్తున్న కార్మికులను అన్యాయంగా తొలగించారని వారిని విధుల్లోకి తీసుకోకుండా చర్చల పేరిట కాలయాపన చేస్తున్నారని విమర్శించారు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ పాలకేంద్రం చైర్మన్ గారు మొండిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు పాల కేంద్రంలో యూనియన్లు ఏర్పాటును జీర్ణించుకోలేని యాజమాన్యం మండివైఖరిని విడనాడాలని కోరారు విజయ పాల కేంద్రంలో పనిచేస్తున్న వందలాదిమంది ఉద్యోగులు కార్మికులను తొలగించి విజయ డైరీ ప్రైవేట్ పరం చేసి వారందరినీ వీధిన పడేసే కుట్రలు చేస్తున్నారని దీన్ని కార్మిక ఉద్యోగ ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు గమనించి పాలకేంద్ర చైర్మన్ మొండి వైఖరి కి నిరసనగా ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు సిఐటియు చేస్తున్న పోరాటానికి ఐఎఫ్టియు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు ఇప్పటికైనా విజయ డైరీ యాజమాన్యం నియంతృత్వ వైఖరిని విడనాడి తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి వై నరసింహులు ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి ఎస్ చౌడప్ప పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు ఎస్ఎండీ రఫీ ఐఎఫ్టియు డివిజన్ అధ్యక్షులు ఎస్ మహమ్మద్,ఇర్ఫాన్ బాషా,రఫీ,నగర్,వలి, హరి,వినోద్ తదితరులు పాల్గొన్నారు.