PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రామిక వర్గమే ఆర్థిక వ్యవస్థకు పునాది

1 min read

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్
– చరిత్రలోనే మార్పునకు నాంది మేడే
– జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : శ్రామిక వర్గం తోనే ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ అన్నారు. మేడే సందర్భంగా స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం పూర్తి భవనం వద్ద జరిగిన మేడే కార్యక్రమంలో డేగ ప్రభాకర్, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. సిపిఐ స్థూపానికి ప్రభాకర్ పుష్పమాల వేశారు. సిపిఐ పతాకాన్ని మన్నవ కృష్ణ చైతన్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కులాలు, మతాలు, రంగులకు అతీతంగా జరుపుకునే కార్మికుల పండగ మేడే అన్నారు. 1886 సంవత్సరం మే 1 మానవాళి చరిత్రలోనే మార్పునకు నాంది పలికిన రోజు మేడే అన్నారు. కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం ప్రధాని మోడీ ఆధ్వర్యంలో రద్దుచేసి 4 లేబర్ కోడ్ లుగా విభజించి కార్మిక వర్గానికి తీరని ద్రోహం తలపెట్టిందన్నారు. 8 గంటల పని విధానానికి మోడీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని విమర్శించారు. కార్మికుల హక్కులను హరిస్తూ నిరంకుశ పాలనను చేస్తున్న మోడీని రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఓడించేందుకు ప్రజలందరినీ చైతన్య పరచడానికి కార్మిక వర్గం అగ్రభాగాన నిలబడి ప్రతిన బూనాలని కోరారు. సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం సాధించిన 8 గంటల పని విధానానికి తూట్లు పొడుస్తూ 12 గంటల పని విధానాన్ని తీసుకువస్తున్న మోడీని గద్దె దింపటమే పరిష్కారం అన్నారు. మోడీ తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ ల స్థానంలో 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించేందుకు నిరంతరం ఐక్యంగా ఉమ్మడి పోరాటాలు చేయాలన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణమే కాకుండా దేశ ఉనికికే ప్రమాదకరంగా మారిన నిరంకుశ, మతతత్వ, విభజన రాజకీయాలను అవలంబిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ ఏలూరు కన్వీనర్ బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన 9 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా విక్రయిస్తూ తన సొంత ఖజానా నింపుకోవటమే లక్ష్యంగా పనిచేస్తుందని విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 3వ తేదీన జిల్లాలో జరిగే రాస్తారోకోలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కడుపు కన్నయ్య, ఏపి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భజంత్రీ శ్రీనివాసరావు, కురెళ్ళ వరప్రసాద్, కొండేటి రాంబాబు, ఉప్పులూరి రవి, హకీమ్, నాగం అచ్యుత్, బి కృష్ణ ప్రసాద్, కోటి, పెచ్చెట్టి శ్రీను, బళ్ల కనకదుర్గారావు, సిరిసొల్ల సోమేశ్, కొల్లూరి సుధారాణి, మావూరి విజయ, అడ్డగర్ల లక్ష్మి ఇందిర, బి శ్రీదేవి, ఉప్పులూరి లక్ష్మి, భవాని, నిస్సి, గొర్లి స్వాతి తదితరులు పాల్గొన్నారు.

About Author