`మిరప` ను తినేస్తున్న పురుగు ఏంటో తెలిసింది !
1 min readపల్లెవెలుగువెబ్ : వేలాది ఎకరాల్లో మిరప పంటను నాశనం చేస్తున్న పురుగు జాడ తెలిసింది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా విధ్వంసం సృష్టిస్తోంది. తొలుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో ఈ పురుగు ఉధృతిని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ పరిశోధనా సంస్థలు రంగంలోకి దిగి అధ్యయనం చేస్తున్నాయి. ఇలా ఒక్కసారిగా దాదాపు అన్ని రకాల పంటలపై దాడి చేసి, నాశనం చేస్తున్న దీనిని వ్యవసాయ శాస్త్రవేత్తలు ‘త్రిప్స్ పార్విస్పైనస్’ అని చెబుతున్నారు. అనూహ్యంగా ఈ ఏడాది ఈ పంటను ఈ కొత్త తామర పురుగు చిదిమేసింది. తొలుత సాధారణ తామర పురుగు ..స్కిప్టో ట్రిప్స్ డార్సాలిస్ గానే భావించారు. సాధారణ పురుగు ఆకుల మీద చేరి రసాన్ని పీలిస్తే, ఈ కొత్త రకం పురుగు పూత, పిందెల్లోకి చేరి రసాన్ని పీల్చి.. కనీస దిగుబడి కూడా రానీయకుండా నాశనం చేస్తుందని గుర్తించారు.