NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలకు రోడ్లు వేయడం లో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం

1 min read

మద్దికేర బురుజుల రోడ్డు వేయాలని టిడిపి జనసేన రోడ్డుపై ధర్నా                                   

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: జనసేన పార్టీ, టిడిపి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు గుంతల ఆంధ్ర ప్రదేశ్కు దారేది అనే కార్యక్రమంలో భాగంగా గురుజుల మద్దికేర రహదారికి మధ్యలో రోడ్డుపై ధర్నా కార్యక్రమం చేపట్టారు. టిడిపి, జనసేన పార్టీ  సంయుక్తంగా నిర్వహించిన “గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది” అనే కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు సిజి రాజశేఖర్, టిడిపి జిల్లా కార్యవర్గ సభ్యులు ధనంజయ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం ప్రజలకు రోడ్లు వేయడం లో పూర్తిగా విఫలమయిందని బురుజుల నుండి మద్దికేర వరకు ఎటు చూసినా రోడ్డు ఆధ్వన్నం గా మారిందన్నారు. గత ఐదు నెలల క్రితం రోడ్డు ప్యాచ్ వర్క్ ల పేరిట  లక్షలు దండుకున్నారని మండిపడ్డారు. మీడియా లో మాత్రం అభివృద్ధి చేసినట్లు వైసిపి వాళ్లు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. రోడ్ల పరిస్థితి ప్రజలకు తెలియచేయడానికి జనసేన, టీడీపి కలిసి ఈరోజు బురుజుల, మద్దికేర మధ్యలో ధర్నా చేశామని చెప్పారు. ఈ ప్రభుత్వానికి బస్సు  చార్జీలను పెంచే దానిపై ఉన్న శ్రద్ధ రోడ్లు వేయడానికి ఎందుకు లేదని ప్రశ్నించారు. ఈ జగన్ రెడ్డికి ప్రజలపై ఏ మాత్రం చిత్తశుద్ధి  అనేది ఉంటే వెంటనే రోడ్డు శాంక్షన్ చేసి నిరూపించుకోవాలని సవాలు విసిరారు. లేదంటే మరో 10 రోజుల తర్వాత జనసేన, టిడిపి ఆధ్వర్యంలో ఇదే రోడ్డుపై రాష్ట్ర రోకో ద్వారా వాహనాల రాకపోకలను పూర్తిగా స్తంభింప చేస్తామని హెచ్చరించారు. ఈ ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు టిడిపి  నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

About Author