వైసీపీ ప్రభుత్వం… రైతులకు ఎం మేలు చేసింది..!
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: వైసీపీ ప్రభుత్వ హాయాంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యం పై టీడీపీ అధినేత శ్రీ నార చంద్ర బాబు నాయుడు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం పై యుద్దభేరి కార్యక్రమం లో భాగంగా ఈరోజు పాణ్యo నియోజకవర్గం గడివెముల మండలం మరియు నందికొట్కూరు నియోజకవర్గం మిడుతురు మండలం రైతులు,టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి అలగనురు రిజర్వాయర్ నీ సందర్శించిన గౌరు చరిత రెడ్డి , గౌరు వెంకట రెడ్డి ఈ సందర్భoగా గౌరు దంపతులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వము వచ్చినప్పటి నుండి గత నాలుగు సంవతసరాలుగా ఈ రిజర్వాయర్ లో నీళ్ళు లేక రైతుల పొట్ట కొడుతున్నారు అని మండిపడ్డరు,ఈ రిజర్వాయర్ పాణ్యo మరియు నందికొట్కూరు నియొజకవర్గల రైతులు కొన్ని వేల ఎకరాలకు ఈ నీరు సాగు చేసుకోవచ్చు అని తెలిపారు .అంతేకాకుండా ఈ రిజర్వాయర్ లో కొన్ని ఏళ్లుగా ఆనకట్ట, కొంగిపోయి,తెగిపోవడం జరిగింది ,3 కోట్ల నిధులతో ఈ వైసీపీ ప్రభుత్వం మరమ్మత్తులు జరపవచ్చు,కానీ ఇంత తక్కువ నిధులతో కూడా మంజూరు చేయలేకపోతున్నారు అని మండిపడ్డారు .ఇప్పుడున్న పాణ్యo నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆరు సార్లు గెలిచిన అని గొప్పలు చెప్పుకోవడం కాదు,ఈ ఆరు సార్లు గా గెలిచి రైతులకు ఎం మేలు చేశారు అని,ఈ రిజర్వాయర్ లో తెగిన ఆనకట్టకు మీ ప్రభుత్వం లో కనీసం నిధులు మంజురు పనులు పూర్తి చెయ్యొచ్చు కదా అని చరిత రెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పాణ్యo నియోజకర్గo గడివెముల మండలం మరియు నందికొట్కూరు నియోజకవర్గo మిడుతురు మండల,ముఖ్య నాయకులు దేశం సత్య నారాయణ రెడ్డి, కాత రమేష్ రెడ్డి,నంద్యాల పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు కే పార్వతమ్మ,రాష్ట మహిళ అధికార ప్రతినిధి సుభద్రమమ్మ,పెసరవాయి లక్ష్మీ దేవమ్మ,తెలుగు యువత రాష్ట కార్యదర్శి ప్రభాకర్ యాదవ్,నియోజకర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రహ్మణ పల్లె నాగిరెడ్డి, మంచాల కట్ట మురళి రెడ్డి,కరిమద్ధేల ఈశ్వర్ రెడ్డి,శివా రెడ్డి, తలముడిపి కశ్వ శంకర్ రెడ్డి,మరియు రైతులు, టీడీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు టీడీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.