విదేశీ విద్యా పథకాన్ని నీరుగార్చిన వైసీపీ ప్రభుత్వం
1 min read– పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేసిన జగన్.
– డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి.
– టీడీపీ అధికార ప్రతినిధి.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు బీసీ పట్టణ అధ్యక్షులు పాణ్యం వేణుగోపాల్ ఆధ్వర్యంలో విదేశీ విద్య పథకాన్ని నీరుగార్చిందని పేద బడుగు బలహీన విద్యార్థులకు విద్యను దూరం చేస్తుందని నిరసిస్తూ బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహశీల్దార్ కార్యాలయంలోని అధికారులకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ చిన్న వెంకటస్వామి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీ, పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా విదేశీ విద్యా పథకాన్ని అనేక ఆంక్షలు విధించి విద్యార్థులకు విద్యను దూరం చేస్తుందని విమర్శించారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీగా వేలాదిమంది పేద బడుగు బలహీన మైనారిటీ విద్యార్థులకు అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ద్వారా సంవత్సరానికి 15 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించి పేద విద్యార్థులకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. అయితే ఈ సైకో పాలనలో పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా ప్రవర్తిస్తూ విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరును తొలగించి జగన్ పేరు పెట్టుకుని అంబేద్కర్ ను అవమానపరిచారని ఆరోపించారు. జగన్ లాంటి వ్యక్తిని సమాజం సహించదన్నారు.వైసీపీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. మళ్లీ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని అప్పుడు ప్రతి ఒక్క పేద బడుగు బలహీన మైనారిటీ వర్గాల విద్యార్థులకు అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని అమలు చేసి అందరికండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి ఐటీడీపీ అధ్యక్షులు ముర్తుజావలి, మైనారిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి శఖీల్ అహమద్, దిగల్సేల్ నాయకులు జకీర్, మైనారిటీ సెల్ పార్లమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సుల్తాన్ మైనారిటీ సెల్ పట్టణ అధ్యక్షులు సౌదీ చాంద్, రసూల్ ఖాన్, రషీద్ ఖాన్, ఆబ్దుల్ వహీద్, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు నిమ్మకాయల రాజు, నిమ్మకాయల మోహన్, ప్రధాన కార్యదర్శి బోల్లేదుల రాజు, జయన్న, తెలుగు యువత నియోజకవర్గం కార్య నిర్వహణ కార్యదర్శి మల్లికార్జున, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు కుమార్, ముత్తు, బ్రంహ, వార్డ్ ఇన్చార్జిలో గిరి, వెంకటేష్,శ్రీనివాసులు, కళాకారు,కృష్ణారెడ్డి మరియు మట్ట,సురేష్, కలాం, తదితరులు పాల్గొన్నారు.