PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 ఆదాయం కోసం.. పేదల నడ్డివిరుస్తున్న వైసీపీ ప్రభుత్వం

1 min read

టీడీపీ మండల అధ్యక్షుడు ముద్దలూరి భానుగోపాల్ రాజు

పల్లెవెలుగు వెబ్​, అన్నమయ్య జిల్లా వీరబల్లి: వైకాపా ప్రభుత్వం చేతకాని అసమర్థ పాలనలో రాష్ట్రంలోని ప్రజలు విసిగి వేసారిపోయారని టిడిపి మండల శాఖ అధ్యక్షడు భానుగోపాల్ రాజు విమర్శించారు. వీరబల్లి మండలం గుర్రప్పగారి పల్లే గ్రామ పంచాయతీలోని బెజవాడ హరిజనవాడ , కోనేటివాండ్లపల్లే, మూడేవారిపల్లే, మాదిరాజుగారిపల్లేలో సోమవారం బాధుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదాయం కోసం పేద ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.గడప గడపకు తిరిగి అరాచక పాలన పై ప్రజలకు వివరించారు.బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది  సంక్షేమ పథకాల పేరుతో అరకొరగా బ్యాంకు ఖాతాలలో నగదు జమ చేస్తూ అన్ని విధాలుగా రాష్ట్రాన్ని  తీవ్ర ఆర్థిక సంక్షోభానికి  గురి చేశారన్నారు . పోలవరం ప్రాజెక్టు పరిస్థితి అదోగతి పాలు చేశారని దుయ్యపట్టారు మూడు రాజదానులంటూ అమరావతిని సర్వనాశనం చేశారని అగ్రహం వ్యకం చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఒక పరిశ్రమ కూడ నెలకొల్పకుండా యువతకు రాష్ట్రంలో  ఒక్కరికి ఉద్యోగ ఉపాది  అవకాశాలు లేకుండా నిరుద్యోగ యువతకు అన్యాయం చేశారని విమర్శించారు. నిత్యం అబద్దాలతో  తప్పుడు ఆరోపణలతో తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ కాలయాపన చేస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ఎ ఒక్క అభివృద్ధి  కార్యక్రమం చేపట్టక పోవడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు  జగన్ ముఖ్యమంత్రిగా పూర్తిగా వైపల్యం చెందారని ఇకనైన ఈ పద్దతులు మానుకొని రాష్ట్రం మరింత నష్టపోకుండా చూడాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు డాక్టర్ అమరేశ్వర్ రాజు,మండల ఉపాద్యక్షుడు దుర్గం ఆంజినేయులు,మహిళా మండల అధ్యక్షరాలు నాగసుబ్బమ్మ, గ్రామ కమిటీ అద్యక్షులు ప్రబాకర్ నాయిడు ,బాస్కర్ రాజు,ఆంజినేయ రెడ్డి ,రాజరాజు,ప్రసాద్ రాజు, మాజీ సర్పంచ్ సుబ్బరామరాజు, సీనియర్ నాయికులు రామ్మోహన్ రెడ్డి, నందకుమార్ నాయిడు ,  తెలుగుయువత పార్లమెంటు కార్యదర్శి నేతి రమేష్ బాబు, తెలుగు యువత సీనియర్ నాయికుడు సుధాకర రాజు, కేశవ, టిడిపి అధ్యక్షడు పవన్ కుమార్ , వెంకటరమణ నాయిడు,మహేష్, నాగభూషణం,నాగప్పనాయిడు, శివరామ రాజు, నరసింహ నాయిడు,వీరమోహన్ నాయిడు,శీతారామిరెడ్డి, బిసి నాయికులు వెంకటరమణ,రాజ, యస్సి నాయికులు వెంకటరమణ, సంజీవ, కిషోర్ ,ప్రసాద్,రెడ్ఢి శీను,వినయ్,ఆంజినేయిలు, గ్రామస్తులు పార్టీ అభిమానులు తదతరులు పాల్గొన్నారు.

About Author