PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గెలుపే లక్ష్యంగా పసుపు సైనికులు పనిచేయాలి

1 min read

– వై నాగేశ్వరరావు యాదవ్ ..తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకు ఈ రోజు డోన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డోన్ నియోజకవర్గానికి సమన్వయ కమిటీని ఏర్పాటు  చేయడం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వై నాగేశ్వరరావు యాదవ్  తెలుగుదేశం పార్టీ డోర్ నియోజకవర్గం నుంచి ధర్మవరం సుబ్బారెడ్డి, డోన్ నియోజకవర్గ అబ్జర్వర్ కాటమయ్య,రాష్ట్ర కార్యదర్శి  తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సంధర్భంగా వై. నాగేశ్వరరావు యాదవ్  మాట్లాడుతూమహానాడులో నారా చంద్రబాబునాయుడు  ప్రకటించిన మేనిఫెస్టోను ప్రతి ఇంటి తలుపు తడుతూ  ప్రజలలోకి బలంగా తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ గెలుపునకు కృషి చేయాలి.అధికార పార్టీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను, అరాచకాలను అన్యాయాలను ఎప్పటికప్పుడు వ్యతిరేకించాలి. అదేవిధంగా తెలుగుదేశంపార్టీ చేపట్టే కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది. క్లస్టర్ ఇన్చార్జిలు, యూనిట్ ఇన్చార్జిలు ఎప్పటికప్పుడు సోసల్ మీడియా లో యాక్టివ్ గా ఉండాలి.అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ముందుకు పోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు అందరు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి.పార్టీ బలోపేతానికి నియోజకవర్గ సమన్వయకమిటీ సభ్యులు అందరు కృషి చేయాలి.ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాలపై సమీక్షించాలి.పార్టీ లో నాయకుల ఎటువంటి విభేదాలు లేకుండా చూసుకోవాలి.వైసీపీ అరాచకాలను సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలి. వాట్సప్, ఫేస్బుక్ ద్వారా టీడీపీ ప్రజలలోకి తీసుకువెళ్ళాలి.అనంతరం… రాష్ట్ర తెలుగుదేశంపార్టీ కార్యదర్శి వై.నాగేశ్వరావు  లైన్స్ క్లబ్ 316J గవర్నర్ గా ఎన్నికైన సందర్భంగా డోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి  సన్మానించారు.ఈ కార్యక్రమంలో టిడిపి అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు గారు, బేతంచేర్ల మండలం టిడిపి అధ్యక్షులు ఎల్లనాగయ్య ,  రామసుబ్బయ్య, (క్లస్టర్ ఇంచార్జ్) గంధం శ్రీనివాసులు , నంద్యాల జిల్లా టిడిపి బీసీ సెల్ అధ్యక్షులు ప్రజావైద్యశాల బెస్తా మల్లిఖార్జున ,గౌరవ సలహాదారులు తిరుమలేష్ చౌదరి గారు,క్లస్టర్ ఇంచార్జులు షేక్షావళి చౌదరి , క్లస్టర్ ఇంచార్జ్ సుదర్శన్ గారు, క్లస్టర్ ఇంచార్జ్ గోవిందు గారు, క్లస్టర్ ఇంచార్జ్ రమేష్ గారు, క్లస్టర్ ఇంచార్జ్ మధుసూదన్ గారు, ప్రసాద్ రెడ్డి , రాంమోహన్ యాదవ్,చక్రపాణి గౌడ్, రాంమూర్తి,వలసల సుధాకర్,మేకల నాగరాజు,కుమ్మరి సుధాకర్, కమలాపురం రామేష్,కేబుల్ కిరణ్, జయ్యన్న, సత్యనారాయణ ,శేషికుమారప్ప,జె.వేంకటేశ్వర్లు,ఎర్రమల నాయుడు, రామిరెడ్డి, శ్రీరాములు , టి.నాగరాజు, పూజారి రామాంజనేయులు, శేఖర్, క్రిష్ణారెడ్డి , గురుస్వామి, కోనేటి కాశీ విశ్వనాథ్, కొచ్చెరువు రామాంజనేయులు, ఎన్.రామచంద్రుడు , బాల రంగన్న,ఎన్.ప్రభాకర్, రాంభూపాల్, పాలరాజు, హుస్సేన్ పీరా,రమేశ్వరెడ్డి, రాముడు, బోయ వీరాంజనేయులు, బిత్తిని గోవిందు, బాలు, అలీబాబా , గుడిపాడు ఓబులేసు, లక్ష్మన్న పాల్గొన్నారు.

About Author