మేకను పెళ్లి చేసుకున్న యువకుడు !
1 min readపల్లెవెలుగువెబ్ : కృష్ణా జిల్లా నూజివీడులో వింత ఘటన జరిగింది. పట్టణంలోని అన్నవరం రోడ్డులో దోష నివారణ కోసం అంటూ ఓ యువకుడు మేకను పెళ్లి చేసుకున్నాడు. జాతకం పట్ల నమ్మకమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తికి రెండు పెళ్లిళ్లు జరుగుతాయని జాతకంలో ఉందట. దీంతో దోష నివారణ జరిపించాలని ఆ యువకుడు నిర్ణయం తీసుకున్నాడు. ఉగాది రోజున స్థానికంగా ఉండే నవగ్రహ ఆలయంలో సదరు యువకుడికి అర్చకుడు మేకతో వివాహం జరిపించాడు. యువకుడు మేకను పెళ్లి చేస్తున్న దృశ్యాలను ఎవరో సోషల్ మీడియాలో పోస్టు చేశారు.