NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కోతుల భ‌యంతో యువ‌తి మృతి

1 min read

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా రేగొండ మండ‌లం నాగ‌ర్లప‌ల్లి గ్రామానికి చెందిన యువ‌తి గంజి శిరీష భ‌వ‌నం మీద నుంచి ప‌డి మృతి చెందింది. వ‌రంగ‌ల్ భ‌ట్టుప‌ల్లి రోడ్డులోని ఐటీడీఏ యూత్ సెంట‌ర్ లో గంజి శిరీష శిక్షణ పొందుతోంది. శిక్షణ అనంత‌రం భ‌వ‌నం పై అంత‌స్తులో ఆమె మిగిలిన అమ్మాయిల‌తో ష‌టిల్ ఆడుతోంది. ఈ స‌మ‌యంలో ఒక్కసారిగా కోతుల గుంపు రావ‌డంతో .. భ‌యంతో అంద‌రూ ప‌రుగులు తీశారు. శిరీష‌కు కోతుల నుంచి త‌ప్పించుకునే క్రమంలో భ‌వ‌నం మీద నుంచి కాలు జారి ప‌డింది. హుటాహుటిన ఆస్పత్రికి త‌ర‌లించారు అక్కడి సిబ్బంది. అయితే అప్పటికే మ‌ర‌ణించిన‌ట్టు డాక్టర్లు తెలిపార‌ని సంబంధిత అధికారులు తెలిపారు. కోతులంటే శిరీష‌కు ఉన్న భ‌యంతోనే ఈ దుర్ఘట‌న జ‌రిగిన‌ట్టు అధికారులు తెలిపారు.

About Author