అమరజీవి పొట్టి శ్రీరాములును నేటితరం యువత గుర్తుంచుకోవాలి
1 min read– అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగ ఫలితమే తొలి భాషా ప్రయుక్త ఉమ్మడి ఏపీ ఆవిర్భావం
-లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు మెల్విన్ జోన్స్, నైస్ స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో వెంకటరమణ కాలనీ మొదటి లైన్ లో ఉన్న నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ సభ్యులు, నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలను అలంకరించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం లయన్స్ జిల్లా అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని తెలుగువారి కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ను నేటితరం యువత గుర్తుంచుకోవాలన్నారు. కులమత, రాజకీయ ,ప్రాంతీయ భావాలకు అతీతంగా అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ అధ్యక్షురాలు లయన్ రాయపాటి నాగలక్ష్మి, లయన్స్ క్లబ్ కార్యవర్గ సభ్యులు,నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.