యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
1 min read
యువత పోరు పోస్టర్లు విడుదల చేసిన ప్రదీప్ రెడ్డి
మంత్రాలయం , న్యూస్ నేడు : ఈ నెల 12 న వైకాపా పార్టీ అధ్యక్షులు వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థులను, యువతను మోసగిస్తున్న కూటమి సర్కార్ పై కర్నూలు లో నిరసన తెలుపుతూ యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండల పరిధిలోని రాంపురం గ్రామంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు యువత పోరు కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విద్యార్థులను,యువతను మాయ మాటలతో మభ్య పెట్టి ఓట్లు దంచుకొని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉసే లేదని విమర్శించారు. సూపర్ సిక్స్ హామీల్లో బాగంగా తల్లికి వందనం, నిరుద్యోగ భృతి గూర్చి బడ్జెట్ లో కేటాయింపులు జరగలేదన్నారు. తల్లికి వందనం లేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని,నెల నెలా నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి,ఇవ్వకుండా యువతను మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన బాబుకు త్వరలోనే మంగళం పాడుతారని ఎద్దేవా చేశారు. 12 న జరగబోయే యువత పోరు కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు యువత పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మంత్రాలయం నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల వైకాపా కన్వీనర్ బీంరెడ్డి, జిల్లా కార్యదర్శి విశ్వనాథ రెడ్డి, వైకాపా యూత్ విభాగం అధ్యక్షులు నరావ రాజశేఖరరెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షులు దయ్యాల మెహాబుబ్,లక్ష్మన్న గురు, నరసింహ అచారి,బందే నవాజ్,మెహాబుబ్ తదితరులు పాల్గొన్నారు.