NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేదల అభ్యున్నతికి వైసిపి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది

1 min read

– మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని

– నాలుగో డివిజన్లో గడపగడపకు మన ప్రభుత్వం విజయవంతం..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తూ సేవలందిస్తున్నరని మాజీ ఉప ముఖ్యమంత్రి , ఎమ్మెల్యే ఆళ్ల నాని  పేర్కొన్నారు. కార్పొరేటర్ రిషి డింపుల్  ఆధ్వర్యంలో 106 వ రోజు గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమాన్ని పాల్గొన్న జనసంద్రంతో స్థానిక 4వ డివిజన్ లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అర్హత కలిగి పథకాలు అందని వారు ఉంటే వారికి పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్ర లో ఎన్నడూ లేనివిధంగా అన్ని వర్గాల సమగ్ర అభివృద్దే లక్ష్యంగా అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలతో పేదల జీవితాల్లో గుణాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ప్రస్తావించిన పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మేలు చేస్తున్న మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నూకపై సుధీర్ బాబు, స్థానిక కార్పొరేటర్ చిలకపాటి డింపుల్ జోబ్ ఋషి, కార్పొరేటర్ పిల్లంగోళ్ళ శ్రీదేవి, తూమరాడ స్రవంతి, జుజ్జువరపు విజయనిర్మల, ఎస్ఎంఆర్ పెదబాబు,  వైఎస్సార్ సీపీ నగర అద్యక్షులు బొద్దాని శ్రీనివాస్,  కమిషనర్ వెంకటకృష్ణ, పలువురు కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

About Author