NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేడు తెరచుకోనున్న థియేటర్లు..

1 min read

సినిమా డెస్క్​ : సెకండ్‌ వేవ్‌ తర్వాత నెల రోజుల పైగానే షాపింగ్‌ మాల్స్‌ ఇతర పెద్ద సంస్థలన్నీ తమ విధులు నిర్వహించడం ప్రారంభించినా సినిమా థియేటర్లు మాత్రం తెరచుకోలేదు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా బయ్యర్లు, థియేటర్‌‌ ఓనర్లు అంతా కొద్దిగా భయపడ్డారన్న మాట వాస్తవం. అయితే నేటి నుంచి ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా థియేటర్లు ఓపెన్‌ కానున్నాయి. మొదటి సినిమాలుగా తిమ్మరుసు, ఇష్క్‌ సినిమాలు నేడు థియేటర్లలలో ప్రదర్శింపనున్నారు. ఈ సందర్భంగా ‘తిమ్మరుసు’ హీరో సత్యదేవ్‌ హైదరాబాద్‌లోని ‘దేవీ 70ఎమ్‌ఎమ్‌’ థియేటర్‌‌కి వెళ్లి తన సినిమాని తనే ప్రమోట్‌ చేసుకున్నారు. ఆడియన్స్‌కి ఉత్సాహపరిచే విధంగా మాట్లాడుతూ తను లైన్‌గా ఐదు సినిమాల షూటింగ్‌లు చేశానని, అన్నిటికీ కరోనా జాగ్రత్తలు పాటించానని తెలిపారు. థియేటర్ల తెరుచుకుంటే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటాయని కూడా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఓటీటీ విలువ పెరిగినా థియేటర్‌ థియేటరే కదా. ఆ అనుభూతి వేరు. నా గత చిత్రం ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ ఓటీటీకి వెళ్లడం కాస్త బాధ కలిగించింది. కానీ, ఆ సమయంలో అదే సరైన నిర్ణయం అనిపించింది. ఈ విషయంలో నిర్మాతనీ దృష్టిలో పెట్టుకోవాలి. ప్రీ రిలీజ్‌ వేడుకలో నాని చెప్పినట్టు మిగతా వాటితో పోలిస్తే థియేటర్లు చాలా సేఫ్‌. ఇలాంటి సమయంలో పెద్ద సినిమాలు రావడం లేదు.. మేం ఎందుకొస్తున్నామంటే మా బడ్జెట్‌కి, మా లెక్కలకీ ఇదొక మంచి అవకాశంలా భావిస్తున్నాం. ఇది అనువైన సమయం.. ఉన్నన్ని థియేటర్లలో విడుదల చేయడమే మంచిది అనిపించింది..అందుకే మేమీ సాహసం చేశామన్నారు’’.. ఇక తేజ సజ్జా నటించిన ‘ఇష్క్‌’ కూడా ఈ రోజు థియేటర్లలలో రిలీజ్‌ అవుతోంది. మరి ప్రేక్షకాదరణ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఎప్పటిలా ఆడియెన్స్‌ థియేటర్స్‌కి వస్తారా..? లేదా కరోనాకి భయపడతారా అన్నది వాళ్ల నిర్ణయమే.

About Author