NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలు స్వేచ్ఛగా .. నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

1 min read

కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం.జిల్లాలోని పలు ప్రాంతాలలో  కేంద్ర సాయుధ బలగాల తో పోలీసుల కవాతు.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు కవాతు నిర్వహించారని కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ గారు   ఒక ప్రకటనలో  తెలిపారు.సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లా పోలీసులు ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి  కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో  కవాతు నిర్వహించారన్నారు.ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని జిల్లా ప్రజలకు  జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఎన్నికలలో ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా దానికి జిల్లా పోలీసు యంత్రాంగం సహకారం ఎల్లవేళలా ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్  తెలిపారు.ఈ రోజు జిల్లా ఎస్పీఆదేశాల మేరకు జిల్లాలోని  కర్నూలు,  పత్తికొండ , ఎమ్మిగనూరు  సబ్ డివిజన్ లలోని పలు ప్రాంతాలలో కేంద్ర సాయిధ బలగాలైన “సశస్త్ర సీమా బల్”  సిబ్బందితో కలిసి పోలీసులు కవాతు నిర్వహించారు. సి.బెళగల్  పోలీసుస్టేషన్ పరిధిలోని కోత్తకోట, ఈర్లదిన్నె, ముడుమాల  గ్రామాలలో  కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు. కోడుమూరు సిఐ మన్సురుద్దీన్, సి. బెళగల్ ఎస్సై తిమ్మారెడ్డి పాల్గొన్నారు.  మాధవరం  పోలీసుస్టేషన్ పరిధిలోని నారాయణ పురం, ఖగ్గల్లు, కాచాపురం, దిబ్బనదొడ్డి, బసాపురం గ్రామాలలో  కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు  కవాతు నిర్వహించారు.మంత్రాలయం సిఐ ఎరిషావలి , మాధవరం ఎస్సై క్రిష్ణమూరి   పాల్గొన్నారు. తుగ్గలి  పోలీసుస్టేషన్ పరిధిలోని  బొద్దిమడుగుల, నునుజురాళ్ళ, నల్లగుండ్ల, మారెళ్ళ, ముక్కెళ్ళ గ్రామాలలో   కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు. పత్తికొండ రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి,  తుగ్గలి ఎస్సై మల్లికార్జున   పాల్గొన్నారు.

About Author