భవిష్యత్తు బాగుండాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ననే కావాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: చాంబర్ ఆఫ్ కామర్స్ లో జరిగిన సమావేశం లో కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ కర్నూలులో జగనన్న ఫోటో పెట్టుకొని జనం వచ్చారు.పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, స్వేచ్ఛ వుండాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి రాష్ట్రానికి కావాలి.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో సుపరిపాలన అందించారు.దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పేదల కోసం 2.30 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు.కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి 500 కోట్లు కేటాయించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 150 కోట్ల రూపాయలతో నగరాన్ని అభివృద్ధి చేశారు.నాడు నేడు పనులతో ప్రభుత్వం పాఠశాలలను 26 కోట్లతో అభివృద్ధి జరిగింది.కర్నూలు త్రాగునీరు సమస్య పరిష్కారం కోసం శాశ్వత నీటి పరిష్కారానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు ఏర్పాటు కు నిధులు కేటాయించారు అన్ని అన్నారు.పుష్కరాల కోసం కర్నూలు కు 100 కోట్ల ను కేటాయించారు. 500 కోట్ల రూపాయలతో లా యూనివర్సిటీ, ఓర్వకల్లు పారిశ్రామిక అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారు అన్ని అన్నారు.కర్నూలు నగరంలోని మూడు దేవాలయాలకు నిర్మాణాలకు నిధులు కేటాయించారు.రాష్ట్రంలో 2.10 లక్షల మందికి రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించారు. మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు.2 వేల కోట్ల రూపాయల ను అసెంబ్లీ కి సంక్షేమ రూపంలో అందించారు.ప్రజా సమస్యలను తాను నేరుగా పరిష్కరిస్తానను.కర్నూలు నగరంలో కరోనా వచ్చిన జనాలకు వారికి కనిపించలేదు.వేల కోట్ల రూపాయలు ఉన్న తెలుగు దేశం పార్టీ నేతలు ప్రజల కోసం ఏమి చేయలేదు అన్ని మండిపడ్డారు.కరోనా సమయంలో టిడిపి పార్టీ నేతలు భయపడి ఇంటి నుంచి రాలేదు.కరోనా కష్టకాలంలో తాను ప్రజా సమస్యలను తెలుసుకొని కోవిడ్ సమయంలో కోవిడ్ సెంటర్లను సందర్శించాము.ప్రజల మేలు చేసి ఉంటే తనకు ఓటు వేయండి.కర్నూలు నగరంలోని పెద్ద మనుషులు తండ్రి ఓ పార్టీ, కొడుకు ఓ పార్టీ లో చేరి ప్రజలను మభ్యపెట్టెందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రజలకు మేము మేలు చేస్తున్నాము, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మైనార్టీలకు పెద్ద పీట వేశారు. నాలుగు ఎమ్మెల్యేలు, అనేక నామినేటెడ్ పదవులను కల్పించారు.