PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్టీ జాబితాలో ఇతర కులాలు వద్దు

1 min read

పల్లెవెలుగు, వెబ్ వెలుగోడు: ఎస్టీ జాబితాలోకి ఇతర కులాలను చేర్చే అంశాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కోడావత్ శంకర్ నాయక్ పేర్కొన్నారు. వారు శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఇతర కులాలను చేర్చడానికి ప్రభుత్వం 52 జీవో ను చేసిందని , గిరిజనులకు ఇప్పటికే ఉపాధి అవకాశాలు తగ్గాయని అన్నారు. ఎస్టీ జాబితాలోకి ఇతర కులాలను చేరిస్తే గిరిజనులు ఇంకా నష్టపోతారని , ప్రభుత్వం జీవో ను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు నాగేష్ నాయక్ , వెంకటేష్ నాయక్ , లాలూ నాయక్ , లక్ష్మా నాయక్ , సుధాకర్ నాయక్ , రవీంద్రా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

About Author