హిందూ ధర్మంలో పతితులు లేరు
1 min read– విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సహకార్యదర్శి ప్రాణేష్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: హిందూ ధర్మంలో పాపులు,పతితులూ ఎవ్వరూ లేరని,హిందువులంతా పుణ్యాత్ములేననీ ఒక వేళ పాపం చేస్తే దైవ దర్శనంతో అది తొలగిపోతుందనీ ఈ రోజు విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో కర్నూలు జిల్లా సమావేశంలో సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సహకార్యదర్శి యస్.ప్రాణేష్ అన్నారు. 1377 కాశీ వద్ద ఉన్న సిర్ గోవర్ధన్ పురంలో చర్మకారుల(చెప్పులు కుట్టే) కుటుంబంలో కలసాదేవి,సంతోష్ దాస్ దంపతులకు మాఘపౌర్ణిమ రోజున జన్మించారనీ,ప్రతిరోజు తన కులవృత్తి ద్వారా తయారుచేసిన చెప్పులు జతలను కాశీకి వచ్చే సాధుసంతులకు ఇచ్చి వారి ఆశీర్వాదం పొందేవాడు మాకే ఎందుకు ఇచ్చానని అడిగితే నేను కుట్టిన పాదరక్షలు ధరించి మీరు దేశమంతా పర్యటిస్తే నాకు పుణ్యం కలుగుతుందని అనేవారట,రామానుజులు వారి శిష్యులు రామానందులవారి వద్ద శిష్యరికం కోసం వేళ్ళాడు కానీ తాను అంటరాని వాడినని దూరంగా నిలబడ్డారట అప్పుడు రామానందులవారు రవిదాసును పిలిచి శిష్యునిగా స్వీకరించాడట నాటి నిరంతరం రామనామ జపంతో జన్మచరితార్థం చేసుకున్నారనీ దీనిని ఆదర్శంగా తీసుకుని కార్యకర్తలందరూ సంత్ రవిదాస్ లా ధర్మకార్యంలో తరించాలని పిలుపునిచ్చారు.కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ మాట్లాడుతూ ఫిబ్రవరి 26 నుండి మార్చి 15 వరకు “ధర్మరక్షానిధి” పేరుతో సంస్థయొక్క ఆర్థిక అవసరాలకోసం హిందూ సమాజం నుండి ధనాన్ని సేకరించాలనీ ప్రతికార్యకర్త కనీసం 20 మందిని కలిసి విశ్వహిందూపరిషత్ గురించి తెలియజేసి ఆర్థిక సహాయాన్ని అర్థించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో విశ్వహిందూపరిషత్ విభాగ్ సేవా కన్వీనర్ గురుమూర్తి,జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్,జిల్లా సహకార్యదర్శి శివప్రసాద్,కోశాధికారి అయొధ్య శ్రీనివాస రెడ్డి,జిల్లా సంఘటనా కార్యదర్శి వడ్లు భూపాలాచారి, నగర అధ్యక్షులు టీ.సీ.మద్దిలేటి, ఉపాధ్యక్షులు శివపురం నాగరాజు, కార్యదర్శి ఈపూరి నాగరాజు,ప్రఖంఢ కార్యదర్శులు గిరిబాబు, సంజన్న,కోడుమూరు కార్యదర్శి నటరాజ్,ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.