హిజాబ్ పై ఆంక్షలు లేవు.. కానీ కొన్ని పరిమితులు ఉన్నాయి !
1 min readపల్లెవెలుగువెబ్ : భారత్‌లో హిజాబ్ ధరించడంపై ఎలాంటి ఆంక్షలు లేవని, అయితే విద్యా సంస్థల్లో క్రమశిక్షణ పరంగా హిజాబ్‌పై కొన్ని రకాల పరిమితులున్నాయని కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై విధించిన ఆంక్షల్ని సవాల్ చేస్తూ దాఖలైన విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన వాదనల్ని కర్ణాటక అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవద్గీ వ్యతిరేకించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం హిజాబ్ ధరించే హక్కు ఉందన్న వాదన సరైంది కాదన్నారు. అయితే ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం హిజాబ్ ధరించే హక్కుని రాజ్యాంగం కల్పించిందన్నారు.