NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెండు రాష్ట్రాల‌ను క‌లిపే కుట్ర జ‌రుగుతోంది !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: కేసీఆర్, జ‌గ‌న్ మొద‌టి నుంచి క‌వ‌ల‌పిల్లల్లా క‌లిసి వెళ్తున్నార‌ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రం కోసం కేసీఆర్, జ‌గ‌న్ ఆలోచ‌న చేస్తున్నార‌ని ఆరోపించారు. తెలంగాణలో ష‌ర్మిల పాద‌యాత్ర చేయ‌డం, క‌లిసిపోదాం అని పేర్ని నాని అన‌డం.. అనుకోకుండా జ‌రిగిన‌వి కాద‌ని అన్నారు. జ‌ల‌వివాదాలు పెంచి రెండు రాష్ట్రాల‌ను క‌లిపే ప్రయ‌త్నం జ‌రుగుతోంద‌న్నారు. కేసీఆర్ భీమ‌వ‌రం లో పోటీ చేస్తారో.. బొబ్బిలిలో పోటీ చేస్తారో తెలియద‌న్నారు. జ‌గ‌న్ జైలుకు వెళ్తాడు కాబట్టి ఉమ్మడి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావాల‌ని కోరుకుంటున్నాడ‌ని అన్నారు. పేర్ని నాని వ్యాఖ్యల‌ను టీఆర్ఎస్ ఎందుకు ఖండించ‌డం లేద‌ని ప్రశ్నించారు.

About Author