NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పట్టాభి వ్యాఖ్యల్లో కుట్ర ఉంది..! ఛీఫ్ విప్​​ శ్రీకాంత్​రెడ్డి

1 min read

పల్లెవెలుగువెబ్​, కడప: టీడీపీ నాయకుడు పట్టాభిరామ్​ చేసిన వ్యాఖ్యల్లో కుట్ర ఉందని, పథకం ప్రకారమే సీఎం జగన్​పై పరుషపదజాలంతో విమర్శలు చేశారని వైసీపీ ఛీఫ్​విప్​ శ్రీకాంత్​రెడ్డి అన్నారు. చంద్రబాబు ముందస్తు పథకం ప్రకారమే పార్టీ నేతలతో రెచ్చగొట్టే వ్యాఖలు చేయిస్తున్నారని ఆరోపించారు. బుధవారం కడపలో మీడియాతో శ్రీకాంత్​రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు భేషరతుగా క్షమాణ చెప్పాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాల్లో తప్పులు ఉంటే చూపాలే తప్పా…, తప్పుడు ప్రచారంతో నీచమైన భాషపదజాలంతో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడడం హేయమని మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబునాయుడు ఏనాడైనా ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకొన్నారా అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.కరోనా సంక్షోభసమయంలో కూడా మాట తప్పకుండా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. టీడీపీ నేతలు ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటించాలంటూ సీఎం జగన్​ మమ్మల్ని ఆదేశించారని ఆయన చెప్పారు. కానీ టీడీపీ నేతలు సీఎం జగన్​ను తిడుతుంటే వైసీపీ కార్యకర్తలు భరించలేక తిరగబడ్డారని ఆయన వివరించారు.

About Author