గొడవలతో నష్టమే కానీ..లాభం ఉండదు
1 min read
చింతలపల్లిలో ప్రజలకు అవగాహన-రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : గ్రామాల్లో గొడవల వల్ల కుటుంబాలకు నష్టమే కానీ లాభం అనేది ఉండదని దీనిని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో ప్రజలు ప్రశాంతత జీవనం గడిపేందుకు ముందుండాలని నందికొట్కూరు రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం అన్నారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో ఎస్సై హెచ్ ఓబులేష్ ఆధ్వర్యంలో గ్రామ వీధుల్లో పోలీసులు కవాతు నిర్వహించారు.తర్వాత సీఐ మాట్లాడుతూ ఎవరో చెప్పిన మాటలు విని గొడవలు తగాదాలు మనస్పర్ధల వల్ల కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకోవద్దని అంతే కాకుండా ఒకరికొకరు కొట్టుకోవడం వల్ల ఒకరు చేసిన తప్పిదానికి కేసులు నమోదు కావడం వల్ల కుటుంబం మొత్తం బాధపడాల్సి వస్తుందని వీటిని దృష్టిలో పెట్టుకొని మీ జీవితాలను బాగు చేసుకుంటూ పిల్లల్ని మంచిగా చదివించాలని సీఐ ప్రజలకు అవగాహన కల్పించారు.మీకు ఏమైనా సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి లేకపోతే మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సుబ్బయ్య,ప్రజలు, పోలీసులు పాల్గొన్నారు.
