సమాజ సేవతోనే బహు ఆనందం..
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ : కర్నూల్ నగరంలోని రాత్రి పూట రైల్వే స్టేషన్ మరియు ఆర్టీసీ బస్టాండ్ ఏరియాలో ఉంటున్న అనాధలకు ,వృద్దులకు ,వితంతువులకు రాజ్ కుమార్ ఫౌండేషన్ ద్వారా చీరలు మరియు దుప్పట్లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి కర్నూలు స్పెషల్ డిఎస్పి షేక్ మహబూబ్ బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్కుమార్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రత్నకుమారి మాట్లాడుతూ పేదలకు సహాయం చేయుటలో గొప్ప మనసు ఉండాలని , ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన మనము పొందే ఆనందం మాటల్లో చెప్పలేము అని ఆమె అన్నారు.ముఖ్యంగా ఇలాంటి అనాధలు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వారికి మేము సహాయం చేయడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలిపారు. చివరగా కర్నూల్ స్పెషల్ డిఎస్పి మహబూబ్ బాషా మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలకు మమ్ములను ఎప్పుడు ఆహ్వానించిన మేము రావడానికి ముందు ఉంటామని మరియు మేము చేసే వృత్తిలో ఎన్నో ఒత్తిడులు ఉంటాయని ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వోకేషనల్ కాలేజీ ప్రిన్సిపాల్ నాగ స్వామి నాయక్, అభయ హాస్పిటల్ మేనేజర్ శ్యామ్, లెక్చరర్ సోమేశ్ మరియు సింగర్ రాణి తదితరులు పాల్గొన్నారు.