వారి కడుపు మంటకు మందే లేదు !
1 min read
పల్లెవెలుగువెబ్ : సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు పిల్లలకి ఇచ్చే చిక్కీపై సీఎం బొమ్మ ఉందంటూ చిల్లర రాజకీయాలతో రాద్ధాంతం చేస్తున్న ఘనత చంద్రబాబునాయుడు, ఎల్లో మీడియాదేనని ఎద్దేవా చేశారు. నంద్యాల బహిరంగ సభలో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రతీ ఇంటి మేనమామగా పిల్లలను చదివించే బాధ్యత తనదని మరోసారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ఎల్లో పార్టీ కడుపు మంట, అసూయకు మందే లేదని.. చివరికి పిల్లలకు అందుతున్న సంక్షేమ పథకంపై కూడా అక్కసు వెల్లగక్కుతున్నారంటూ జాలిపడ్డారు సీఎం జగన్.