PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోస్టల్​బ్యాలెట్ విషయంలో ఏ కుట్రా లేదు..తప్పుడు విమర్శలు మానుకోవాలి! మంచు విష్ణు

1 min read

పల్లెవెలుగువెబ్​, హైదరాబాద్​: పోస్టల్​బ్యాలెట్​ విషయంపై ఏలాంటి కుట్ర లేదని, ప్రకాశ్​రాజ్​ తప్పడు ఆరోపణలు మానుకోవాలని ‘మా’ ఎన్నికల్లో ఓ ప్యానల్​ నుంచి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మంచువిష్ణు అన్నారు. మంగళవారం సాయంత్రం ప్రకాశ్​రాజ్​ చేసిన విమర్శలకు కౌంటర్​గా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎవరికీ తెలియని వ్యక్తులతో పోస్టల్​బ్యాలెట్​ కోసం కొందరు సీనియర్​ నటులకు సంబంధించిన సొమ్ము కట్టామన్న ఆరోపణలో నిజం లేదని విష్ణు స్పష్టం చేశారు. చిత్రపరిశ్రమంలో సుమారు 190మంది 60ఏళ్లుపైబడిన సీనియర్​ నటీనటులు ఉన్నారని, సీనియర్​ నటులు ఓటింగ్​కు రాలేని పక్షంలో పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా రూ.500 చెల్లించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘం చెప్పిందన్నారు. ఈమేరకు తాము కొందరు సీనియర్లను సంప్రదించగా ఎక్కువ శాతం నేరుగా వచ్చి ఓటు వేస్తామన్నారని, కొందరు మాత్రం పోస్టల్​ బ్యాలెట్​ అడిగారన్నారు. కృష్ణ, కృష్ణంరాజు, శరత్​బాబుల ప్రమేయంతోనే వారి డబ్బును ఎన్నికల సంఘానికి చెల్లించామని వివరించారు. అయితే సీనియర్​ ఓటర్లకు పోస్టల్​ బ్యాలెట్​ రుసుం చెల్లించేందుకు సమయం ఇస్తామని, మీరు కట్టిన సొమ్మును తిరిగి తీసుకెళ్లమని ఎన్నికల సంఘం చెప్పిందన్నారు. సినీపెద్దలను అవమానపర్చేలా విమర్శలు చేశారని దుయ్యబట్టారు. నిజం తెలుసుకోకుండా మాట్లాడుతోన్న ప్రకాశ్​రాజ్​ గతం మర్చిపోయి మాట్లాడుతున్నారని, వ్యక్తిగతంగా కుటుంబాల జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. తాను ఈవీఎం విధానం వద్దని, పేపర్​బ్యాలెట్​ విధానం కావాలని ఎన్నికల సంఘాన్నికోరినట్లు విష్ణు చెప్పారు. ఈవీఎం విధానం అయితే ఓట్ల ట్యాపరింగ్​ అనే విమర్శలు వచ్చే అవకాశం ఉందని, అలాగే పేపర్​ బ్యాలెట్​ అయితే ఎన్నిసార్లయినా లెక్కబెట్టుకోవచ్చన్నారు. చిత్రపరిశ్రమ ఒక కుటుంబం లాంటిది. ఎన్నికల తర్వాత అందరూ కలిసి ఉండాల్సిన వాళ్లమని, వ్యక్తిగత విమర్శలతో దూరం చేసుకునే పరిస్థితి తేవద్దని సూచించారు.

About Author