ఏపీలో కక్ష సాధింపు రాక్షస పాలన తప్ప అభివృద్ధి శూన్యం
1 min read– టీడీపీ నాయకులు గిత్త జయసూర్య..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల ముఖద్వారమైన నందికొట్కూరు లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ తెలుగు దేశం పార్టీ చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శనివారం 11వ రోజుకు చేరుకున్నాయి .ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ సెక్రెటరీ జయసూర్య మాట్లాడుతూ అధికార వైఎస్సార్సీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ, జనసేన ఎన్నికలకు కలిసి వెళ్ళడం పవన్ కల్యాణ్ ప్రకటించడం తో ఏపీ రాజకీయాలను ఆ ప్రకటన ప్రభావితం చేస్తుంది అన్నారు. వైసీపీ చేస్తున్న మాయలకు, జిమ్మిక్కులకు లొంగకూడదని జయసూర్య అన్నారు.స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఒక్క రూపాయి అవినీతి జరగలేదన్నారు. ఈ వయస్సులో చంద్రబాబును జైల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, చన్నీళ్లతో స్నానం చేయించే పరిస్థితి తెప్పించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. ఇంత శాడిజం ఏమిటని ప్రశ్నించారు. ఆయన వయస్సుకు, ఆయన రాజకీయ అనుభవానికి కూడా మర్యాద ఇవ్వడం లేదన్నారు. ఏపీలో కక్ష సాధింపు, రాక్షస పాలన సాగుతోందని మండిపడ్డారు. చంద్రబాబును అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టీ ఇంకా రాక్షస ఆనందం పెట్టలేని ఈ వైసీపీ ప్రభుత్వం చూస్తుంది అని, కచ్చితంగా ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు ముందు ఉంది అని అన్నారు..ఈ కార్యక్రమంలో కన్వీనర్ భాస్కర్ రెడ్డి, ముర్తుజావాలి, జాకీర్, షకీల్ అహమ్మద్, వహీద్,ఏసేపు,రాజన్న, రాజు, మోహన్, సలాం, శ్రీను, లక్ష్మీ కాంతారెడ్డి, జమీల్, రసూల్, ఇనాంతుల్లా, అయ్యరాజు, చాంద్, కళాకార్, అప్సర్, కుమార్, నూర్, బాబులు, ఖాళీళ్ బేగ్, జయాకర్,బాలకృష్ణ అభిమానులు జనసెనా పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.