తెలంగాణలో ఉన్నట్టు ఏపీలో డ్రగ్స్ కల్చర్ లేదు !
1 min readపల్లెవెలుగువెబ్ : తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి తానేటి వనిత స్పందించారు. తెలంగాణతో పోలిస్తే అభివృద్ధి అంశాల్లో నెమ్మదిగా వెళ్తున్నామని వనిత అన్నారు. తెలంగాణ తరహా మాదకద్రవ్యాల వినియోగం, పబ్కల్చర్ ఏపీలో లేదని మంత్రి తానేటి వనిత గుర్తు చేశారు. ఏపీలో ఎన్ని క్లిష్టపరిస్థితులు ఉన్నా పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రమ్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. శిక్షలు త్వరగా అమలైతే నేరస్తుల్లో భయం పుడుతుందని తానేటి వనిత స్పష్టం చేశారు.