PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో ఎంసెట్ లేదు.. ఇక నుంచి EAP సెట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఆంధ్ర ప్రదేశ్ లో ఇక నుంచి ఎంసెట్ ఉండ‌దు. ఎంసెట్ బ‌దులుగా ఈఏపి సెట్ నిర్వహించ‌నున్నారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసి కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ గా ఈఏపి సెట్ ను నిర్వహించ‌నున్నారు. ఈ మేర‌కు విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ ప్రక‌ట‌న చేశారు. ఈనెల 24 నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తారు. ఈనెల 26 నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు. జులై 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌ర‌ణ ఉంటుంది. ఆగ‌స్టు 19 నుంచి 25 వ‌ర‌కు ప‌రీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాద‌న‌లు పంపిన‌ట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

About Author