వంగవీటి రాధా పై రెక్కీ జరిగినట్టు ఆధారాలు లేవు !
1 min readపల్లెవెలుగువెబ్ : టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా పై రెక్కీ జరిగినట్టు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని విజయవాడ సీపీ కాంతి రాణా అన్నారు. రాధా ఇచ్చిన సమాచారం తీసుకున్నామని, అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని తెలిపారు. అయితే ఈ ఘటనపై అవాస్తవాలు ప్రసారం చేయొద్దని అన్నారు. ప్రతిపక్ష నేత వాస్తవాలు తెలుసుకోకుండా డిపార్టుమెంట్పై ఆసత్యలు మాట్లాడారని అన్నారు.విజయవాడలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని సీపీ తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదం లేదని, పోలీసు అధికారులు రాధాతో మాట్లాడరని తెలిపారు. ఎలాంటి అఫెన్స్ జరగనప్పడు, క్రిమినల్ యాక్టివిటీ లేనపుడు కేసు ఎలా పెడతామని అన్నారు. రాధాకు భద్రత ఏర్పాటు చేస్తామని సీపీ పేర్కొన్నారు.