NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదు..

1 min read

అంగన్వాడి వర్కర్స్ యూనియన్ సిఐటియు ..

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  ప్రభుత్వం బేదిరిస్తే భయపడడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరని శనివారం నాడు. అంగన్వాడి వర్కర్స్ మీద ఎస్మా ప్రయోగించడంతో( గడివేముల) తహసిల్దార్ కార్యాలయం వద్ద సమ్మెకు మద్దతుగా. అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నంద్యాల జిల్లా సిఐటియు అధ్యక్షురాలు నిర్మల మాట్లాడుతూ ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి  నిరసనగానే 26 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నామని 2019 వరకు టిడిపి ప్రభుత్వ హయాంలో 10500 రూపాయలు జీతం గా తీసుకున్నామని వైసిపి నాయకులు చెబుతున్నట్టు ₹7,000 నుండి జగనన్న ఏకంగా 11500 పెంచడం అబద్ధమని పాదయాత్రలో అప్పటి ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో ఉన్న జీతాలు కంటే వెయ్యి అదనంగా ఇస్తానని మాట ఇచ్చారని కానీ అధికారంలో వచ్చాక మాట తప్పారని వెయ్యి మాత్రం ఇచ్చారని తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇవ్వలేదని.. ఎస్మా ప్రయోగించడానికి మేము ప్రభుత్వ ఉద్యోగులను కాదని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని 11 డిమాండ్లలో సమ్మె చేస్తున్నట్టు తెలిపారు స్కీం వర్కర్లకు జీ ఓ 2 వర్తించదని తెలిపారు . అంగన్వాడీలకు మద్దతుగా మధ్యాహ్నం టిడిపి కన్వీనర్ సత్యం రెడ్డి ఆధ్వర్యంలో అంగన్వాడీలకు అన్నదానం చేశారు.

About Author