ఏపీలో ఆర్థిక క్రమశిక్షణ లేదు.. భారీగా రెవెన్యూ లోటు !
1 min readపల్లెవెలుగు వెబ్: ఏపీలో 2019_20 సంవత్సరంలో ఎక్కువగా రెవెన్యూ లోటు ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏపీలో ఊహించిన దానికంటే ఎక్కువగా రెవెన్యూ లోటు ఉందని ఆమె స్పష్టం చేశారు. ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. అమ్మ ఓడి, ఉచిత విద్యుత్ లాంటి పథకాల వల్ల రెవెన్యూ లోటు అధికంగా ఉందన్నారు. ఏపీలో ఆర్థిక క్రమశిక్షణ లేని కారణంగా రెవెన్యూ లోటు అధికంగా ఉందని కాగ్ నివేదిక స్పష్టం చేస్తోందని ఆమె చెప్పారు.