టికెట్ల రేట్లు పెంచేది లేదు !
1 min read
పల్లెవెలుగువెబ్: ఏపీలోని ఆలయాల్లో దర్శన, ఇతర టికెట్ల రేట్లు పెంచే ప్రసక్తే లేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి, దేవదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇప్పటిదాకా ఏ ఆలయంలోనూ ధరలు పెంచలేదు..పెంచే ఆలోచనాలేదన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో అభిషేకం టికెట్ ధరల పెంపు విషయంలో వివాదంపై మంత్రి స్పందించారు. ఆలయంలో అభిషేకం సేవా టికెట్ ధరను రూ. 750 నుంచి రూ.5 వేలకు పెంచారు. ఈవో సురేష్ బాబు దేవాదాయ శాఖ, ఆలయ పాలకమండలిని సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకోవడంతో సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై బదిలీ వేటు వేసింది. ఈ క్రమంలో ఇతర ఆలయాల్లోనూ టికెట్ల ధరలు పెంచుతారన్న వార్తలను మంత్రి కొట్టు ఖండించారు.