NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్థర్ అన్నా సాటి లేరు..నీకెవ్వరూ..

1 min read

– ఎమ్మెల్యే ఆర్థర్ కు భారీ గజమాలతో సన్మానం

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ అన్న సాటిలేరు నీకెవ్వరు అంటూ మిడుతూరు మండలంలో ఉన్న వివిధ గ్రామాల వైసీపీ నాయకులు ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తారు.11.05.2022 న కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా 07.11.2023 న మంగళవారం రోజు ముచ్చుమర్రి గ్రామం తో గడప గడప కార్యక్రమం పూర్తి చేశారు.అంతేకాదు రాష్ట్రంలోనే గడప గడప కార్యక్రమాన్ని పూర్తిచేసిన  మొట్ట మొదటి ఎమ్మెల్యేగా ఆయన పేరు పొందారు.ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకుగాను నందికొట్కూరు పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా పూలమాలలు శాలువాలతో సన్మానిస్తూ భారీ పెద్ద కేకును ఎమ్మెల్యేతో కట్ చేయించారు.వీరిలో భాగంగా మిడుతూరు మండలంలోని వివిధ గ్రామాల నాయకులు తలముడిపి వంగాల సిద్ధారెడ్డి,సల్కోటి గోవర్ధన్ రెడ్డి,జిల్లా పార్టీ కార్యనిర్వాహక సభ్యులు డాక్టర్ వనజ,షేక్ ఇనాయతుల్ల,వీరారెడ్డి, వెంకట్,పుల్లయ్య,నడిపి నాగన్న,జాన్,చంద్రశేఖర్ రెడ్డి,కాల రమేష్ తదితరులు భారీ గజమాల మరియు శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడప గడప కార్యక్రమం నాకు చాలా సంతృప్తి కలిగించిందని జగనన్న ప్రవేశపెడుతున్న అనేక వినూత్న పథకాలతో ప్రజలకు ఇంకా చేరువై మరెన్నో సేవలు చేసే భాగ్యం కలిగిందని కార్యకర్తలకు పాత్రికేయులకు మరియు మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు.

About Author