PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

– ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్‌ కేఎస్‌ జవహర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, విజయవాడ: కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయొద్దని ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్‌ కేఎస్‌ జవహర్ రెడ్డి అన్నారు. ఎన్‌440కే వైరస్‌పై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో ఈ వైరస్‌ తీవ్రంగా ఉన్నట్టు ఎలాంటి నిర్థారణ జరగలేదని.. అందుకు సంబంధించిన పరిశోధన డేటా కూడా ఏమీలేదని ఆయన వెల్లడించారు. ‘‘ప్రతీ నెలా సీపీఎంబీకి 250 నమూనాలు పంపుతాం. ఏపీ, తెలంగాణ, కర్ణాటకల నుండి నమూనాలను జన్యు శ్రేణి పరీక్షల కోసం సీసీఎంబీ హైదరాబాద్‌కి పంపిస్తున్నారు. ఎన్ 440కె (బి.1.36) వైరస్ దక్షిణ భారత దేశం నుండి వెళ్లిన నమూనాల్లో గుర్తించారు. 2020 జున్‌, జూలై నెలల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక నుంచి వెళ్లిన నమూనాల్లో గుర్తించారు. దాని ప్రభావం గత డిసెంబర్, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కనిపించింది. కానీ మార్చి నెలలో అది పూర్తిగా అంతర్థానమైంది, ఇప్పుడు దాని ప్రభావం చాలా స్వల్పం. ప్రస్తుతం బి1.167, బి.1 వైరస్ స్ట్రెయిన్‌ల ప్రభావం దక్షిణ భారత దేశంపై ఎక్కువగా ఉందన్నారు.

About Author