PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బైక్ లో పెట్రోల్ లేద‌ని రూ. 250 ఫైన్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బైక్‌పై వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించకపోయినా, ట్రాఫిక్ నిబంధనలు పాటించకున్నా ఫైన్ వేయడం సాధారణంగా జరుగుతుంటుంది. కానీ కేరళలోని ఓ ట్రాఫిక్ పోలీస్ మాత్రం బైక్‌లో సరిపడా పెట్రోల్ లేదని రూ.250 ఫైన్ వేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను బసిల్ శ్యామ్ అనే వ్యక్తి తన ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారింది. బైక్‌లో పెట్రోల్ లేకపోతే కూడా ఫైన్ వేస్తారా? ఇలాంటి రూల్ కూడా ఉందా? అని నెటిజన్లు కేరళ ట్రాఫిక్ పోలీసులపై సెటైర్లు వేస్తున్నారు.

                                            

About Author