పోలీసుల రక్షణ లేదు.. పులివెందుల దాటాలంటే భయం !
1 min read
పల్లెవెలుగువెబ్ : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులోని అప్రూవర్ దస్తగిరి మరోసారి మీడియా ముందుకు వచ్చారు తనకు పోలీసులు రక్షణ కల్పించడం లేదని, పులివెందుల దాటి వెళ్లాలంటే భయంగా ఉందని డ్రైవర్ దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశాడు. శనివారం దస్తగిరి మీడియాతో మాట్లాడుతూ కేటాయించిన ఇద్దరు గన్‌మెన్లు తనతో రావడం లేదని తెలిపారు. ప్రతిసారీ ఫోన్ చేసి సెక్యూరిటీ కావాలని కోరడం ఇబ్బందిగా ఉందని దస్తగిరి చెప్పాడు. తాను ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రతిసారి సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ కు ఫోన్ చేసి చెప్పాలంటే కష్టమవుతోందని వాపోయాడు. సెక్యూరిటీ లేకపోవడం వల్ల తన పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదన్నారు. తనకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని దస్తగిరి ప్రశ్నించారు.