PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పిల్లలకు భోజనం పెట్టడంలో ఎలాంటి ఇబ్బంది లేదు

1 min read

– జిల్లాలో అన్ని స్కూల్స్, హాస్టళ్లను పరిశీలించాం

– అన్ని చోట్ల బియ్యం స్టాక్ ఉంది

– జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పిల్లలకు భోజనం పెట్టడంలో ఎలాంటి ఇబ్బంది లేదని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన పేర్కొన్నారు.మంగళవారం కలెక్టర్ కోసిగి ఏపీ మోడల్ స్కూల్ మరియు బాలికల హాస్టల్ ను తనిఖీ చేశారు..విద్యార్థినులతో మాట్లాడారు.. టిఫిన్,భోజనం,స్నాక్స్ సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.. బియ్యం స్టాక్ ను పరిశీలించారు.అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ పత్రికల్లో  బియ్యం లేవని  వ్యతిరేక వార్తలు వచ్చిన కారణంగా కోసిగి ఏపీ మోడల్ స్కూలే కాకుండా జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్ లో మధ్యాహ్న భోజనం, వెల్ఫేర్ హాస్టల్స్ లో బియ్యం స్టాక్ ను చెక్ చేశామని తెలిపారు.. అన్ని చోట్ల స్టాక్ ఉందని కలెక్టర్ తెలిపారు..అదే క్రమంలో కోసిగిలో ఉండే మోడల్ స్కూల్, బాలికల హాస్టల్ లో కూడా   ఫిజికల్ గా బియ్యం స్టాక్ ను తాను చెక్ చేశానన్నారు..ఇక్కడ  కూడా వారానికి సరిపడా బియ్యం స్టాక్ ఉందని కలెక్టర్ తెలిపారు.. ఎవరూ లేకుండా పిల్లలతో కూడా విడిగా  మాట్లాడానన్నారు.. టిఫిన్, స్నాక్స్, లంచ్, డిన్నర్ అంశంలో ఏమైనా ఇబ్బంది పడ్డారా అని అడిగానని, ఇక్కడ ఉన్న  78 మంది పిల్లల్లో ఎవరూ కూడా  భోజనం విషయంలో  ఇబ్బంది పడలేదని తెలిపారని కలెక్టర్ పేర్కొన్నారు. ఫిజికల్ గా బియ్యం స్టాక్  ఉందని, భోజనం విషయం లో పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేదని కలెక్టర్ తెలిపారు..బియ్యం స్టాక్ లో ఎపుడైనా ఇబ్బందులు వస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, పిల్లలకు భోజన పరంగాఎలాంటి ఇబ్బందులు లేకుండా  తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా  కలెక్టర్ అధికారులకు సూచించారు.

About Author