వైసిపి పార్టీ నాయకులను తెదేపా పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదు…
1 min read
వర్గ విభేదాలు వీడి పార్టీ బలోపేతం కోసం కృషి చేయండి…
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం…
కార్యకర్తల సమావేశంలో తెదేపా ఇన్చార్జి తనయుడు, యువ నాయకుడు గిరి మల్లేష్ గౌడ్
హోళగుంద , న్యూస్ నేడు: వైసీపీ పార్టీ నాయకులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వర్గ విభేదాలు వీడి గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి తనయుడు, యువ నాయకుడు గిరి మల్లేష్ గౌడ్ అన్నారు.గురువారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెదేపా మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ నాయకుల,కార్యకర్తల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరి మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ వైసిపి నాయకులను పార్టీలో చేర్చుకుంటారనే వదంతులు నమ్మవద్దని, గ్రామస్థాయిలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని అన్నారు. వర్గాలుగా విడిపోయి భేదాభిప్రాయాలు పెట్టుకోకూడదని, తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఎన్ని బేధాలు ఉన్న అందరూ కలిసి కుటుంబ సభ్యులుగా పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. అదేవిధంగా ప్రతి బుధవారం ఆలూరు తెదేపా కార్యాలయం నందు పబ్లిక్ గ్రీవెన్స్ చేపట్టడం జరుగుతుందని నాయకులకు గానీ కార్యకర్తలకు గానీ ఎలాంటి సమస్యలు ఉన్న పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో అర్జీ రూపంలో ఇస్తే ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో 164 స్థానాల్లో కూటమి ప్రభుత్వం సత్తా చాటి అధికారం చేపట్టిన విధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని కార్యకర్తలు నాయకులు ఆ దిశగా పని చేయాలని అన్నారు.పార్టీలో కుటుంబ సాధికార సారథుల పేరిట కొత్త వ్యవస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారని వెల్లడించారు. ప్రతి 30 కుటుంబాలకు ఈ సాధికార సారథి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తారన్నారు.ఆర్ధిక అసమానతలు తొలగించేలా ఈ సారథులు పని చేస్తారని తెలిపారు. సాధికార సారథులుగా మహిళలకు సమ ప్రాధాన్యం ఇస్తామన్నారు.ప్రతి కుటుంబానికి న్యాయం చేసేందుకు ఈ విభాగం పని చేస్తుందని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి నాయకుడిని ప్రతి కార్యకర్తను గుర్తించి, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వర్గ విభేదాలు వీడి ప్రతి ఒక్కరు పార్టీ కోసం కుటుంబ సభ్యులు లాగా కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య, , తెదేపా సీనియర్ నాయకులు పంపాపతి, అబ్దుల్ సుభాన్, సిబిఎన్ ఆర్మీ మోయిన్, అబ్దుల్ రహిమాన్, ఎల్లార్తి మల్లికార్జున,మైనార్టీ కార్యదర్శి ఆదం, దిడ్డి వెంకటేష్, శాలి అమాన్, శాలి మెహబూబ్ భాష,అంజి,జాకీర్,తెలుగు యువత జిల్లా కార్యదర్శి సురేంద్ర,తిక్క స్వామి,సిద్దు, టిఎన్ఎస్ఎఫ్ మల్లి, ఎల్లార్తి మహేష్, ఎంపిటిసి బసప్ప, సర్దార్, మండల తెదేపా నాయకులు కార్యకర్తలు, బిజెపి జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
