జగనన్న గోరు ముద్ద అమలులో రాజీ పడే ప్రసక్తి లేదు
1 min read– జడ్పీ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తనిఖీ..
– విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.. 15 వ వార్డు కౌన్సిలర్ కృష్ణవేణి
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న గోరు ముద్ద మెనూ అమలులో రాజీ పడే ప్రసక్తి లేదని 15వ వార్డు కౌన్సిలర్ కృష్ణవేణి అన్నారు. సోమవారం నందికొట్కూరు పట్టణంలో 15 వ వార్డులో ఉన్న జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో వార్డు కౌన్సిలర్ కృష్ణవేణి వార్డు ఇంచార్జి బ్రహ్మయ్య అచారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏప్రిల్ 3 నుంచి 10 వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు జగనన్న గోరుముద్ద లో భాగంగా అందిస్తున్న గుడ్డు, చిక్కి నాణ్యమైన పౌష్టికాహారం అందుతుందా అని విద్యార్థులను అని విద్యార్థుల ను అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా రాగిజావా ప్రతిఒక్కరూ తప్పక తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజన నిర్వాహుకులకు విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనం అందించాలని ఎక్కడ కూడా రాజీ పడేప్రసక్తి లేదని విద్యార్థుల ఆరోగ్యం కోసం జగనన్న గోరు ముద్దలో ఎన్నో మార్పులు తెచ్చారని వాటిని తప్పక మెనూ ప్రకారం పాటించాలని సూచించారు. అనంతరం స్వయంగా విద్యార్థుల మధ్యలో కూర్చుని భోజనం చేసి సంతృప్తి వ్యక్తంచేశారు. వార్డు కౌన్సిలర్ తమ మధ్యలో కూర్చుని భోజనం చేయడంతో విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిధర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.