మహిళ లేనిదే… సమాజం లేదు
1 min read– సమాజంలో పురుషుల కన్నా మహిళల పాత్ర కీలకం
– అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో కలెక్టర్ జి. వీరపాండియన్
– కోవిడ్లో సేవలు అందించిన మహిళలకు సన్మానం
– ఆటల పోటీలలో గెలుపొందిన మహిళా ఉద్యోగులకు బహుమతులు ప్రధానం
పల్లెవెలుగు, కర్నూలు
సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, మహిళలు లేనిదే సమాజం లేదని జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ జి. వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) సయ్యద్ ఖాజా మోహిద్దీన్, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, డిఆర్ఓ పుల్లయ్య, ఆర్ డి ఎ పిడి శ్రీనివాసులు, ఐసిడిఎస్ పిడి భాగ్యరేఖ జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కేక్ కట్ చేసి మహిళా ఉద్యోగులకు పంచి … అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా నాయకత్వం – కోవిడ్ – 19 ప్రపంచంలో సమాన భవిష్యత్ సాధన అంశంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో కోవిడ్ కష్ట కాలంలో నిర్వారామంగా సేవలు అందించిన కార్యకర్తలు పెద్ద హరివనం కె.ప్రభావతి (హెల్త్ వర్కర్), పెద్ద కడబురు జి.ప్రభావతి (ఆశ వర్కర్), కర్నూలు జి.బాలదుర్గమ్మ (అంగన్వాడీ టీచర్), హుసేనా పురం -3 ఎస్. దస్తగిరిమ్మ (అంగన్వాడీ ఆయా), కర్నూలు యశోదమ్మ (మున్సిపల్ శానిటరి వర్కర్), కర్నూలు వెంకటేశ్వరమ్మ (సెక్యూరీటి), కర్నూలు లలిత (కానిస్టేబుల్), సి.బెళగల్ మున్నెమ్మ (రెవెన్యూ శాఖ విఆర్ఎ) ను జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు. అలాగే విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఎడి విజయ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో మొట్ట మొదటి సారిగా హిజ్రా ( ట్రాన్స్ జెండర్స్) లు 10 మందికి జెండర్ సర్టిఫికెట్ లు, గుర్తింపు కార్డులు జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడారు. అనంతరం జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు అభివృద్ధి)రామ సుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటిలో ఓ అమ్మాయి ఉంటే… ఇంటికే ఒక కళ ఉంటుందన్నారు. మహిళలు లేకపోతే సమాజమే లేదన్నారు. ప్రతి రోజు మహిళలకు మహిళా దినోత్సవం అని అన్నారు.
విజేతలకు బహుమతులు అందజేత
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని గత రెండు రోజులుగా జరిగిన వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన మహిళా ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జేసీలు రామ సుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా మోహిద్దీన్ లు బహుమతులు ప్రధానం చేశారు. విశేష సేవలు అందించిన అంగన్వాడీ కార్యకర్తలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో కలెక్టర్ సతీమణి జి.ఆండాళ్ , జేసీ రామసుందర్ రెడ్డి సతీమణి ప్రసన్న, జేసీ (ఆసరా మరియు సంక్షేమం) సయ్యద్ ఖాజా మోహిద్దీన్ సతీమణి షహనాజ్, మున్సిపల్ కమిషనర్ డి.కె.బాలాజీ సతీమణి డీ.కె.పృద్వి కళ్యాణీ, డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ అనురాధ, సిపిఓ అనుపమ, సిరికల్చర్ డిడి పరమేశ్వరి, ఎడి వాణి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమా, సోషల్ వేల్ఫేర్ డిపార్ట్మెంట్ డిడి రమాదేవి, మైనారిటీ వేల్ఫేర్ ఈడి షాభిహ పర్వీన్, ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగపు ప్రెసిడెంట్ గడివేముల తహసిల్దార్ నాగమణి, కార్యదర్శి విజయభారతి (కోపరేటివ్), ట్రెజరర్ స్వర్ణలత పోలీస్ (డిపార్ట్ మెంట్), మహిళా ఉద్యోగుల ప్రెసిడెంట్ సరస్వతి, మహిళా ఉద్యోగుల ప్రతినిధులు, అధిక సంఖ్యలో మహిళ ఉద్యోగులు పాల్గొన్నారు.