పోలవరంతో భద్రాచలానికి ముప్పు లేదు !
1 min readపల్లెవెలుగువెబ్: పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే తెలంగాణలోని భద్రాచలానికి ఎలాంటి ముంపు ముప్పు ఉండబోదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీకి చెందిన ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకే కాకుండా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు కూడా ముప్పు ఉండబోదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు గురువారం ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన అధికారులతో కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఓ సమావేశాన్ని నిర్వహించింది. వర్చువల్ పద్దతిన జరిగిన ఈ సమావేశానికి 4 రాష్ట్రాల నుంచి నీటి పారుదల శాఖ అధికారులు హాజరయ్యారు.