మహిళ లేనిదే.. సమాజం లేదు: డిప్యూటీ కలెక్టర్ దాసిరాజు
1 min readపల్లెవెలుగు వెబ్,ఏలూరు: స్ర్తీ లేకపోతే జననం లేదు… స్ర్తీ లేకపోతే గమనం లేదు…స్త్రీ లేకపోతే… సృష్టే లేదు… కంటి పాపలే కాపాడే మాతృమూర్తికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు డిప్యూటీ కలెక్టర్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ దాసిరాజు. మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ మరియు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ దాసి రాజు ఆధ్వర్యంలో కార్యాలయ మహిళా సిబ్బందికి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉదయం మేలుకొని నాటి నుండి సాయంత్రం విశ్రమించే వరకు మహిళ యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ వారు చేస్తున్న సేవలను కొనియాడుతూ సన్మానించారు, ముందుగా ఉమెన్స్ డే కేక్ కట్ చేసి ఒకరినొకరు ఆప్యాయతను సంతోషాన్ని వ్యక్తం చేసుకొన్నారు,నేటి సమాజంలో మహిళలు రాజకీయ సామాజిక మరియు విద్యావేత్తగా సాంకేతిక రంగాన్ని అందిపుచ్చుకొo టున్నారని.అన్ని రంగాలలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు,కార్యాలయ సిబ్బంది మొత్తం ఒక వేదికపై ఉండటంతో పండుగ వాతావరణం సంతరించుకుంది. తదుపరి మహిళా దినోత్సవానికి ఎవరు ఎవరు ఎక్కడ ఉంటారు అనే విషయం చర్చనీయాంశంగా మారి ఒకింత అసహనానికి గురైన వెంటనే తేరుకొని సంతోషంతో నవ్వులు వెల్లివిరిశాయి.ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు సిబ్బంది తెలియజేశారు, దానిలో భాగంగా కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగిని కుమారుడు బర్త్ డే కేక్ కట్ చేసి బాలుడికి సిబ్బంది బహుమతిని అందజేశారు, ఈ కార్యక్రమంలో బి పల్లవి,ఎస్ కె జేరిన,ఏ తేజస్వి ,ఎం జోష్నా ,సిహెచ్ లిత,పి దుర్గాదేవి, కె అచ్యుత గౌరీ,పి హిమబిందు,టీ బేబీ వందన, ఎం ఇందిరా ప్రియదర్శిని, ఎన్ చరిష్మా ,పి మాధవి,దేవి,బి భాగ్య ఎం లక్ష్మి ,కె యశోద కుమారి,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.