వందశాతం మార్పులతో మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చు! మంత్రి బాలినేని
1 min readపల్లెవెలుగువెబ్, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి త్వరలో మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆయన మంత్రివర్గ విస్తరణలో వందశాతం మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. అధికశాతం కొత్తవారికి మంత్రివర్గంలో స్థానం కల్పించే వీలుందని బాలినేని అన్నారు. పార్టీ విధానాలకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని, మొదటి మంత్రివర్గం ఏర్పాటులో స్థానం కల్పించిన మంత్రులు రెండేళ్లపాటు కొనసాగుతాయరని, తర్వాతే మలివిడత మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న విషయాన్ని అప్పట్లోనే చెప్పారన్న విషయాన్ని బాలినేని గుర్తు చేశారు. విస్తరణ క్రమంలో తనను మంత్రిపదవి నుంచి తొలగించిన స్వాగతిస్తానని అన్నారు. రెండేళ్ల కాలం పూర్తయిన నేపథ్యంలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు నెలకొని ఉండడం దృష్ట్యా ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న మంత్రుల్లో ఎవరికి కొనసాగింపు ఉంటుందో..?, ఎవరికి ఉద్వాసన ఉంటుందో..? అన్న ఆందోళన కర పరిస్థితులు నెలకొన్నాయి. ఏదేమైనా ఇప్పటికే మంత్రివర్గంలో స్థానం కోసం ఎదురుచూస్తుండడం కొందరు ఎమ్మేల్యేల పేర్లు సైతం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మంత్రిపదవులు ఎవరిని వరిస్తాయన్నది వేచిచూడాల్సిందే.