PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కారులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండాల్సిందే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ప్ర‌తి కారులో 6 ఎయిర్ బ్యాగులు ఉండేలా కేంద్ర ప్ర‌భుత్వం క‌ఠిన నిబంధ‌న‌ను అమ‌లులోకి తీసుకొస్తోంది. అక్టోబ‌ర్ 1 నుంచే ఈ నిబంధ‌న‌ను అమ‌లులోకి తీసుకురానుంది. ఈ మేర‌కు కేంద్ర ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ గురువారం ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇక‌పై ప్ర‌తి కారులో క‌నీసం 6 ఎయిర్ బ్యాగులు ఉండాల్సిందేన‌ని ఆయ‌న ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ప్ర‌యాణికుల భ‌ద్ర‌త దృష్ట్యా ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా ఆయ‌న ప్ర‌క‌టించారు. కార్ల వేరియంట్లు, ధ‌ర‌ల‌తో ఏమాత్రం సంబంధం లేకుండా ప్ర‌తి కారులో క‌నీసం 6 ఎయిర్ బ్యాగులు ఉండాల్సిందేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

                                    

About Author