వరిలో వచ్చే తెగులు పై అవగాహన ఉండాలి
1 min readపల్లెవెలుగు , వెబ్ చెన్నూరు: వరి పొలాల్లో వచ్చే బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు విషయంలో రైతులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కడప కృషి విజ్ఞాన కేంద్రం డయాగ్నోస్టిక్ శాస్త్రవేత్త శశికళ అన్నారు. శుక్ర వారం మండలం లోని చిన్నమాచపల్లి, రా చిన్నాయపల్లి, గ్రామాల్లో డిస్టిక్ రిసోర్స్ సెంటర్, కడప కృషి విజ్ఞాన కేంద్రం డయగ్నోస్టిక్ వారి ఆధ్వర్యంలో శాస్త్రవేత్త శ్రీ శశికళ అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ పి పద్మజ ,డిఆర్సి డివి రమణారెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ డి ఆర్ సి ,వరి పొలాలను పరిశీలించారు,, అనంతరం వారు రైతులతో మాట్లాడుతూ, వరిలో వచ్చే బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులుకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 25 కేజీలు పై పాటుగా వేసుకోవాలని అదేవిధంగా యూరియా వేయుటకు వాయిదా వేసుకోవాలని తెలియజేశారు, అలాగే ఎకరాకు streptomycin 120 గ్రాములు, అలాగే కాపర్ ఆక్సి క్లోరైడ్ 600 గ్రాములు కలిపి పిచికారి చేయాలని తెలియజేశారు, అలాగే అక్కడక్కడ దోమపోటు కనబడినదని, దానికి తొలి దశలుగా ఆసిఫేట్ 1.5 గ్రాములు ,లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి అలాగే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పైమెట్రోజైన్ 0.6 గ్రా లీటరు నీటికి కలిపి పిచ్చిగారి చేయాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్ కె శ్రీదేవి తో పాటు వి ఏ ఏ జి రామకృష్ణారెడ్డి చిన్నమచుపల్లి , రామనపల్లె వి ఏ ఏ సునీల్ పాల్గొన్నారు.