PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజల్లో చైతన్యం రావాలి.. టి.జి భరత్

1 min read

తెదేపా అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజల భవిష్యత్తు బాగుంటుందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు.  నగరంలోని ధర్నా చౌక్ వద్ద తెదేపా ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో టిజి భరత్ పాల్గొన్నారు. ఈ దీక్షకు జనసేన నేతలు సురేష్, అర్షద్ తో పాటు ఇతర నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా టి.జి భరత్ మాట్లాడుతూ చంద్రబాబును కలిసి వచ్చిన తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి మాట ఆయన మనసులో నుంచి వచ్చిందన్నారు. నాలుగున్నర సంవత్సరాల వైసీపీ పాలనపై ఆయన మాట్లాడారన్నారు. చంద్రబాబు అవునంటారో కాదంటారో అన్నది పక్కన పెట్టి టిడిపితో కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని పవన్ కళ్యాణ్ చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబుని ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని ప్రజలు బాధపడుతున్నారన్నారు. ఆధారాలు లేకుండా ఇలా చేయడం సరైంది కాదన్నారు. రాష్ట్రంలో రాజధాని ఎక్కడా అంటే చెప్పే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అప్పట్లో ఆ రాష్ట్ర ప్రజలు పౌరుషంతో పోరాడి తెచ్చుకున్నారని.. మన రాష్ట్ర ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. అప్పుడే పాలకుల్లో భయం ఉండి సరైన విధంగా నిర్ణయాలు తీసుకుంటారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ర్యాంకింగ్స్ లో మొదటి పది స్థానాల్లో మన రాష్ట్రానికి చోటు లేదని.. ఇప్పుడు జరుగుతువన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అన్నారు. అందుకే చంద్రబాబు చెప్పిన విధంగా ఆయన నిర్దేశించిన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నామన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తున్నామన్నారు. గతంలో ఫోన్ నంబర్ అడిగితే చెప్పడానికి ప్రజలు భయపడేవారని.. కానీ ఇప్పుడు చంద్రబాబు కోసం సంతకాల సేకరణ చెపడుతున్నామంటే స్వయంగా ప్రజలే వచ్చి సెల్ నంబర్ ఇచ్చి సంతకాలు చేస్తున్నారన్నారు. ప్రజలు గత ప్రభుత్వ పాలనకు ఇప్పటి పాలనకు తేడా ఏంటో గమనించాలన్నారు. నాయకులు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, ప్రజా సంఘాలతో మాట్లాడి జరుగుతున్న పరిస్థితులను వివరించాలన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అమ్మ ఒడి అందరికీ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఒక్కరికే ఇస్తున్నారని. తమ పార్టీ వస్తే ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ ఇస్తామన్నారు. చంద్రబాబు తీసుకొచ్చిన స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ పొందిన ఎంతో మంది పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. వాళ్లే సోషల్ మీడియాలో ఈ విషయాలను చెబుతున్నారన్నారు. సరైన నాయకుడు ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటారన్నారు. కర్నూల్లో తాను ఎమ్మెల్యే అయితే పరిశ్రమలు తీసుకొచ్చి ప్రజలకు ఉపాధి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ మహిళా కమిటీ అధ్యక్షురాలు మారుతీ శర్మ, క్రిస్టియన్ సెల్ టౌన్ ప్రెసిడెంట్ ప్రసాద రావు, టి.ఎన్.ఎస్.ఎఫ్ టౌన్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, స్టేట్ బిసీ సెల్ మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీ సంజీవ లక్ష్మి, క్లస్టర్ ఇంచార్జి చంద్రశేఖర్, వార్డు ఇంచార్జీలు గున్నామార్క్, రాజశేఖర్, సురేంద్ర, మనీష్ నాయుడు, బాలు, అజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

టిడిపి, ఎన్నికలు, ఫోన్​, ఇంచార్జీలు,

About Author