సామాజిక తనిఖీలో అవకతవకలు ఉండకూడదు
1 min read– ఉపాధి సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి
– డ్వామా పిడి యదు భూషణ్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 16వ విడత సామాజిక తనిఖీ లో భాగంగా గురువారం ఉదయం 10 గంటలకు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయావరణంలో ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. డ్వామ పిడి యదుభూషన్ రెడ్డి ఆధ్వర్యంలో10 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏ ఏ పనులు చేపట్టడం జరిగిందో, ఎంతెంత ఖర్చు చేశారో వివరంగా ప్రతి పని కి సంబంధించిన నివేదికలు చదివి వినిపించారు, 01-04-2021-నుండి31-03- 2022 వరకు 16వ విడత సామాజిక తనిఖీకి లో భాగంగా ఈ పనులు చేపట్టినట్లు ప్రజా వేదిక సందర్భంగా తెలియజేశారు, ఇందులో దాదాపు ఐదు కోట్ల రూపాయల వరకు గుర్తించిన పనులపై ఖర్చు చేసినట్లు వారు సభ వేదిక మీదుగా ప్రజలకు , ప్రజా ప్రతినిధుల సమక్షంలో తెలపడం జరిగింది, ఈ సందర్భంగా డ్వామ పిడి , రామనపల్లె, ఓబులంపల్లె, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు,మేట్లు, విషయంలో అసహనం వ్యక్తం చేశారు, మాస్టర్ల విషయంలో సక్రమంగా లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ఆయన వారిని హెచ్చరించారు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో మండల వ్యాప్తంగా జరిగిన పనులపై ఆయన ఆరా తీయడం జరిగింది , అదేవిధంగా ఎక్కడైతే పనులు జరిగాయో ఆ పనుల వద్ద పనులకు సంబంధించిన నేమ్ బోర్డులు ఏమయ్యాయి అని ఆయన ఉపాధి సిబ్బందిని నిలదీశారు, పద్ధతులు మార్చుకోకపోతే చర్యలు తప్పవని ఆయన వారికి చెప్పడం జరిగింది, అంతేకాకుండా 4, వేల 8 వందల 42 పెన్షన్ లపై ఆడిట్ నిర్వహించడం జరిగింది, అనంతరం ఎంపీపీ చీర్లసురేష్ యాదవ్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు సంబంధించిన పంట కాలువలు వంటి వాటిపై దృష్టి సారించి రైతులకు ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాలని గ్రామీణ ఉపాధి హామీ సిబ్బందికి తెలిపారు, కాగా మండల అభివృద్ధి అధికారి గంగనపల్లి సురేష్ బాబు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ వేదికలో డి వి ఓ సోమశేఖర్ రెడ్డి,అబుడ్సన్ మెన్ యోగాంజనేయరెడ్డి, జె క్యు సి, సాంబశివారెడ్డి, ఎస్ ఆర్ పి అంజలి, మండల ఉపాధ్యక్షులు ఆర్ ఎస్ ఆర్( చిన్న) ప్రభుత్వ అధికారులు ఉపాధి హామీ పథకం సిబ్బంది . ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు. మెట్లు. ఉపాధి కూలీలు ఈ ప్రజా వేదికలో పాల్గొన్నారు.