PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు

1 min read

– జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు  : కర్నూలు జిల్లాలో ఈనెల 19 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు మండలంలో జగనన్న చేదోడు నాలుగవ విడతకు సంబంధించి నగదు జమ చేయనున కార్యక్రమానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన సంబంధిత అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం  నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జాయింట్ కలెక్టర్, వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన మాట్లాడుతూ నెల 19వ తేదిన  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు మండలంలో జగనన్న చేదోడు నాలుగవ విడతకు సంబంధించి నగదు జమ చేయనున్నారని, ఈ కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా విధులు నిర్వహించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ముఖ్యంగా హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణానికి వచ్చే దారిలో గుంతలు లేకుండా ప్యాచ్ వర్క్, స్పీడ్ బ్రేకర్స్ తొలగించడంతో పాటు సభా ప్రాంగణంలో బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు విద్యుత్ శాఖ వారు విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. వైద్య మరియు ఆరోగ్య శాఖ వారు అంబులెన్స్ ను అందుబాటులో ఉంచుకోవాలని డిఎం అండ్ హెచ్ఓనుఆదేశించారు.లబ్దిదారులకు ఇబ్బంది లేకుండా తాగునీరు,స్నాక్స్ ,భోజన వసతులు ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ, డిఆర్డిఏ, అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక వాహనాలను ఏర్పాటు చేయాలని అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు.సమావేశంలో  జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

About Author