PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్రమ త‌ల్లిదండ్రులు ఉంటారేమో..కానీ అక్రమ సంతానం ఉండ‌దు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రపంచంలో అక్రమ త‌ల్లిదండ్రులు ఉంటారేమో కానీ.. అక్రమ సంతానం ఉండ‌ద‌ని క‌ర్ణాట‌క హైకోర్టు కీల‌క వ్యాఖ్యలు చేసింది. పుట్టుక‌తో పిల్లల‌కు ఎలాంటి సంబంధం ఉండ‌ద‌ని తెలిపింది. బెంగ‌ళూరు విద్యుత్ స‌ర‌ఫ‌రా కంపెనీలో ప‌నిచేసే ఉద్యోగి 2014లో మ‌ర‌ణించారు. ఈ నేప‌థ్యంలో త‌న‌కు త‌న తండ్రి ఉద్యోగాన్ని ఇవ్వాల‌ని ఆ వ్యక్తి రెండో కొడుకు సంతోష బెస్కాం ను కోరారు. మొద‌టి భార్యకు విడాకులు ఇవ్వకుండానే .. రెండో భార్యను చేసుకోవ‌డం చ‌ట్టవిరుద్ధమ‌ని, అలాంటిది రెండో భార్య సంతానానికి ఉద్యోగం ఇవ్వడం బెస్కాం నిబంధ‌న‌ల‌కు వ్యతిరేక‌మని బెస్కాం స్పష్టం చేసింది. ఈ నేప‌థ్యంలో కె. సంతోష హైకోర్టును ఆశ్రయించారు. ఈ సంద‌ర్భంగా హైకోర్టు ప‌లు కీల‌క వ్యాఖ్యలు చేసింది. త‌ల్లి,తండ్రి లేకుండా ప్రపంచ‌లో పిల్లలెవ‌రు పుట్టర‌ని, పుట్టుక‌లో పిల్లల పాత్ర ఉండ‌ద‌ని చెప్పింది. కాబ‌ట్టి అక్రమ త‌ల్లిదండ్రులు ఉంటారేమో కానీ అక్రమ సంతానం ఉండ‌రనే వాస్తవాన్ని చ‌ట్టం గుర్తించాల‌ని హైకోర్టు వ్యాఖ్యానించింది.

About Author