PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోటీ పరీక్షల్లో ఇంట‌ర్వ్యూలు ఉండ‌వు..ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఏపీపీఎస్సీ పోటీ ప‌రీక్షల్లో ఇంట‌ర్వ్యూలు ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 స‌హా అన్ని కేట‌గిరి పోస్టుల‌కు ఇంట‌ర్వ్యూలు రద్దు చేసిన‌ట్టు ప్రక‌టించింది. ఈ మేర‌కు సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ ముఖ్య కార్యద‌ర్శి శ‌శిభూష‌ణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగుల ఎంపిక‌లో ఇక నుంచి ఇంట‌ర్వ్యూలు ఉండ‌బోవ‌ని చెప్పారు. పోటీ ప‌రీక్షల్లో పార‌ద‌ర్శక‌త కోస‌మే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్తర్వులు వెలువ‌డిన తేది నుంచి ఆదేశాలు వ‌ర్తిస్తాయ‌ని వెల్లడించింది.

About Author